శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తాం
మంథనిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని,(విజయక్రాంతి): శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తామని మంథనిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు. సోమవారం మంథని పట్టణంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ గా తమ తండ్రి శ్రీపాదరావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ... తమ కుటుంబం ఈ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించిన మంథని నియోజక వర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.
తండ్రి బాటలో అన్న శ్రీధర్ బాబు మంత్రిగా మంథని నియోజకవర్గానికి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి నిరంతరం సేవలు అందిస్తున్నాడని, వారి బాటలో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని, మంథని నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నానని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కష్టపడాలని కోరారు. శ్రీపాదరావు ఆశయాలను నెరవేర్చేందుకు నిరంతరం ఇలాగే ప్రజల కోసం పనిచేస్తుంటామని శ్రీనుబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమాదేవి, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి, నాయకులు శశిభూషణ్ కాచే, మంథని సత్యం, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామగిరి మండలంలో
రామగిరి మండలంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామయ్యపల్లి బస్ స్టేజ్ వద్ద శ్రీపతి రావు విగ్రహానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. బేగంపేట్ ఎక్స్ రోడ్ వద్ద తొట్ల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీనుబాబు పాల్గొని పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రొడ్డ బాబు, సర్పంచులు వనం రామచంద్రరావు, చింత మహేష్, పుల్లెల కొమురయ్య, నాయకులు కాటం సత్యం, బండారి సదానందం, ముత్యాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముత్తారం మండలంలో
ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ఉన్న మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహం వద్ద సోమవారం శ్రీపాదరావు జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలవేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బియ్యం శివకుమార్, సర్పంచ్ లు పెగడ తిరుమల కుమార్, రాపల్లి రాజయ్య, మెంగని తిరుపతి, కొట్టే అన్నపూర్ణ ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




