మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్
15-05-2026 02:01 AM
బెజ్జంకి, మే14: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా లింగాల శ్రీనివాస్ నియమితుల య్యారు. ఈ సందర్భంగా శీను మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి , జిల్లా,మండల నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తానని తెలిపారు.






