1 March, 2026 | 8:41 PM

వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి అలక ఉత్సవం

01-03-2026 04:39 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి అలక ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి శివాలయానికి అలక వచ్చారు, పూజల అనంతరం స్వామివారికి కానుకలు సమర్పించారు.

ఈ సందర్భం గా శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం చైర్మన్ పల్లా మురళీధర్ సదా లక్ష్మీ దంపతులను శ్రీ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అల్లంకి అరుణ్ కుమార్, అర్చకులు వల్లకొండ మఠం రమేష్, వల్లకొండ మఠం మహేష్, సౌమిత్రి శ్రావణ్ కుమార్ భక్తులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.