వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ భూమి పూజ
06-03-2026 12:17 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఆర్ఆర్ఓ కాలనీలో శుక్రవారం వైభవంగా శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ పున: నిర్మాణ పనుల భూమి పూజ నిర్వహించారు. శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవర్త ఆచార్యులు, అనంతశ్రీ విభూషితి త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద క్షేత్రంగా ఈ ఆలయానికి నామకరణం చేశారు.ఆలయ నిర్మాణానికి వివిధ పార్టీల నేతలు, వ్యాపారాలు ముందుకు వచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




