శ్రీశ్రీ హోలిస్టిక్ రెడ్ అంబులెన్స్ సేవలు
- గుండెనొప్పి, పక్షవాత సహాయ కేంద్రం ప్రారంభం
- తక్షణ వీడియో కనెక్టింగ్ నెంబర్ 8886666108 విడుదల
- 24x7 గుండెనొప్పి, పక్షవాతం అత్యవసర అంబులెన్స్ సేవలు ప్రారంభం
- అత్యవసర సమయాల్లో నిబద్ధతను చాటుకుంటామంటున్న చైర్మన్ డాక్టర్ వి.ఎస్.రామచంద్ర
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాం తి): ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అత్యవసర వైద్య సహాయాన్ని అందించేందుకు శ్రీశ్రీ హోలిస్టిక్స్ ఆసుపత్రి, రెడ్ అంబులెన్స్ సంయుక్తంగా 24x7 అత్యవసర అంబులెన్స్ సేవలు, గుండెనొప్పి, పక్షవాతం సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమే ష్, ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్, భారత బీమా సమాచార బ్యూరో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి 108 సేవల మాజీ అధినేత వెంకట్ చం గవల్లి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఛా తీనొప్పి, గుండెనొప్పి రోగులు నిపుణులైన వైద్యులతో తక్షణమే వీడియో ద్వారా కనెక్ట్ అయ్యేందుకు 888 6666 108ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా తక్షణ వైద్య సలహా, ముందస్తు ముప్పు అంచనా, గుండె, పక్షవా తం అత్యవసర పరిస్థితులను సకాలంలో గు ర్తించడం, వేగవంతమైన నిర్ణయం తీసుకోవడం, ఆసుపత్రికి చేరుకోవడం సేవలను అందించనున్నారు.
సకాలంలో వైద్య స్పంద న ప్రాముఖ్యతను, అత్యవసర సేవల పాత్ర ను డాక్టర్ శ్రవణ్, డాక్టర్ నీలేష్ (ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు), డాక్టర్ మనోజ్ (ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్), డాక్టర్ మైత్రి (న్యూరో ఫిజీషియన్) వివరించారు. ఈ సం దర్భంగా అతిథులు మాట్లాడుతూ.. శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. సకాలంలో, వేగంగా వైద్యం అందినప్పుడే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయన్నారు.
ఆసుపత్రి చైర్మన్, గుండె వైద్య విభాగ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ స్. రామచంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తుషార ఆలూరి, ఇతర ఉన్నతాధికారులు, రోగి-కేంద్రీకృత, సాంకేతికతతో కూడిన ఆరో గ్య సేవలను మెరుగుపరచడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమం తో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ రోగులకు స రైన సమయంలో సహాయం అందేలా చూ స్తూ అత్యవసర సంరక్షణ సేవలను వేగవంతంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.






