శ్రీ ఎస్‌ఎంవీ ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం
మెరుగైన జీవనశైలితో రోగాలు దరిచేరవు: డాక్టర్ లిఖిత
మహబూబ్‌నగర్, జులై 26 (విజయక్రాంతి): మెరుగైన జీవనశైలిని పాటిస్తే రోగాలు దరిచేరవని శ్రీ ఎస్‌ఎంవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లిఖిత పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విజయవంతమైనట్లు ప్రకటించారు. ఈ శిబిరంలో మొత్తం 96 మంది రోగులకు వివిధ రకాల వైద్యసేవలను అందించారు. ఉచిత రక్త పరీక్షలు నిర్వహించడంతోపాటు, ఉచిత మందులను పంపిణీ చేశారు.
షుగర్, బీపీ, మధుమేహం, ఒంటినొప్పులు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, జ్వరం, జలుబు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యపరీక్షలు చేసి మందులు అందజేసి వారికి మెరుగైన ఆరోగ్యశైలికి సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్‌లోనూ శ్రీ ఎస్‌ఎంవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రకటించింది.






