2 July, 2026 | 12:07 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం

14-04-2026 05:14 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జువ్వాడి కృష్ణారావును ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నత్తి రాము, ఎద్దులాపురం రమేష్, నరసయ్య, కాంగ్రెస్ గంగారెడ్డి, గాజుల గంగాధర్, మద్దెల స్వామి, కుంచపు రాములు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.