2 July, 2026 | 10:49 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 05:17 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్నాధపురం పంచాయతీ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకలలో సర్పంచ్ కుంజా వినోద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగన్నాధపురం మెయిన్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్  జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో అధికారం లేకుండా చేశారని అన్నారు.

జయంతి వేడుకలలో ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ మాట్లాడుతూ... చదువు అంటే ఏమిటో తెలియని రోజుల్లో అంబేద్కర్ అనేక ఉన్నత చదువులు చదివి మేధావిగా మారి రాజ్యాంగాన్ని రచించారని ఆయన గొప్ప దార్శనీయ వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జలగం మాధవి  వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం బోడప్ప, మిడియం నారాయణ, రామాచారి, కూరం రామకృష్ణ, గుంటూరు సాయి, ఈర్ల రామ్మోహన్ గ్రామ పెద్దలు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.