శ్రీ మహాలక్ష్మీ నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించిన సర్పంచ్ దండెం ఆదర్శ్
21-04-2026 12:00 AM
వెల్దుర్తి, ఏప్రిల్ 20 : వెల్దుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన శ్రీ మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ ను వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, ఉపసర్పంచ్ శ్రవణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నందున అంతేకాకుండా మండలంలో నిరుపేద ప్రజలు ఎక్కువగా ఉన్నందున వారికీ అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స చేయించాలని అంతేకాకుండా నిరుపేదల ప్రజలకు సేవ చేయాలని మూడు నెలలకు ఒకసారి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి ప్రజలకు సేవ చేయాలని కూడా నర్సింగ్ హోమ్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమ--ంలో మండల ముఖ్య నాయకులు, నర్సింగ్ హోమ్ నిర్వాహకులు, పాల్గొన్నారు.






