ఫిలిం మేకింగ్‌పై వర్క్‌షాప్
సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 20 : షార్ట్ ఫిలిమ్స్, సినిమా రంగాలలో రాణించాలని అనుకునే వారికోసం సిద్దిపేటలో 30 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆసక్తి గలవారు ఈ నెల 26 నుంచి సిద్దిపేటలోని మోర్ సూపర్ మార్కెట్ వెనకాల గల వేద సొల్యూషన్స్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
కాగా ఫిలిం మేకింగ్ లో ఉన్న 24 డిపార్ట్మెంట్ లపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, సిద్దిపేట పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు నర్సింలు, లింగమూర్తి, శ్రావణ్, స్వామి చరణ్, హరీష్, నవీన,కనక లక్ష్మీ, సుభాష్ గౌడ్ పాల్గొన్నారు.






