2 May, 2026 | 2:40 AM

కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాల అమలు

02-05-2026 01:41 AM

మంచిర్యాల ఎంఎల్‌ఏ ప్రేంసాగర్ రావు

మంచిర్యాల, మే 1 (విజయక్రాంతి) : కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని మంచిర్యాల ఎంఎల్‌ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు పేర్కొన్నారు.

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో శుక్ర వారం నిర్వహించిన మే డే వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ దుర్గం క్రాంతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ లతో కలిసి హాజరై మాట్లాడారు. 

జిల్లాలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసంప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.  

పలువురు అవార్డులు, ఎంపీడీఓలకు కంప్యూటర్లు అందజేత...

కార్మిక శాఖకు చెందిన బి సత్యనారాయణ, ఉపాధి కల్పన కింద వై రమేష్ (ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్) , ఉత్తమ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఓరియంట్ సిమెంట్(దేవాపూర్), ప్రత్యేక కేటగిరీ (బాల కార్మిక) కింద శివాజీ (7 తరగతి విద్యార్థి, జడ్.పి.హెచ్.ఎస్. టేకుల బస్తి, బెల్లంపల్లి) లకు అవార్డులను మంచిర్యాల ఎంఎల్‌ఏ ప్రేంసాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం ఏంఎన్‌ఆర్ ఇజిఎస్ పనుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మంజూరు చేసిన కంప్యూటర్లను జిల్లాలోని 16 మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అందజేశారు.  వివిధ శాఖల జిల్లా అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.