2 April, 2026 | 3:16 AM

శ్రీ చైతన్య స్కూల్ అరుదైన ఘనత

02-04-2026 01:31 AM

అమెరికా నాసా ఎన్‌ఎస్‌ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో వరుసగా 15వ సారి ఛాంపియన్

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): అమెరికా నాసా ఎన్‌ఎస్‌ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2026లో శ్రీ చైతన్య స్కూల్ వరుసగా 15వ సారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపం చ వ్యాప్తంగా ఈ పోటీలో మొత్తం 31 దేశాలు పాల్గొనగా, మొత్తం 134 వి న్నింగ్ ప్రాజెక్టులు ప్రకటించగా, అం దులో భారతదేశం సాధించిన మొత్తం 80 అవార్డులలో అత్యధికంగా 57 అ వార్డులను ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులు మాత్రమే గెలుచుకున్నారు.

ఇది భారతదేశం సాధించిన మొత్తం ఫలితాలలో 71 శాతం. శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ మాట్లాడుతూ ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన ఏకైక విద్యాసంస్థ శ్రీ చైతన్య మాత్రమేనని తెలిపా రు. మొత్తం 57 విన్నింగ్ ప్రాజెక్టులను కేవలం శ్రీ చైతన్య మాత్రమే సాధించిందని, వీటిలో ప్రపంచస్థాయిలో మొదటి ప్రైజ్ 6 ప్రాజెక్టులు, రెండో ప్రైజ్ 11 ప్రాజెక్టులు, మూడో ప్రైజ్ 10 ప్రాజెక్టు లు, హానరెబుల్ మెన్‌షన్స్ 30 ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. ఈ 57 విన్నింగ్ ప్రాజెక్టులలో 549 మందికి పైగా విద్యార్ధులు పాల్గొని విజయం సా ధించారని ఆమె పేర్కొన్నారు.