13 April, 2026 | 4:52 AM

ఎస్‌ఆర్ విద్యార్థుల విజయభేరి

13-04-2026 03:06 AM

హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్ రెండవ సంవత్సర ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎంపీసీ విభాగంలో రోహిణి(హాల్ టికెట్ నెం.2643200756) 1000కి గాను 996 మార్కులు సాధించారు.

అలాగే సీహెచ్ ఫ్లోరెన్స్‌రుత్ (హాల్ టికెట్ నెం. 2644201480) 1000మార్కులకు 996 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో ఎన్.సాయికిరణ్ (హాల్ టికెట్ నెం. 2650204298) వెయ్యికి 995 మార్కులు సాధించారు. జొబియా ఫాతిమా (హాల్ టికెట్ నెం.2660226904) వెయ్యికి  994 మార్కులు సాధించారు.

ఎంఈసీ విభాగం లో పి.వికాశ్‌కుమార్ శెట్టి(హాల్ టికెట్ నెం.2659216207) వెయ్యి మార్కులకు 992 మార్కులు సాధించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషా న్ని తెలియజేస్తూ ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి భవిష్యత్‌లో మరింత అత్యుతమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు.