13 April, 2026 | 4:51 AM

స్టేట్ టాపర్ లిస్ట్‌లో చేవెళ్ళ మోడల్ కాలేజీ విద్యార్థిని

13-04-2026 02:53 AM

చేవెళ్ళ ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ మోడల్ స్కూల్, &జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థిని శృతిలయ ఎంపీసీలో 994 మార్కులు, సీహెచ్ స్పందన బైపీసీలో 963 మార్కులు, వర్షిత సీఈసీలో 976 మార్కులు భార్గవి ఎంఈసిలో 978 మార్కులు సాధించారు.

ఈ మేరకు ప్రకటనలో విడుదల చేశారు. జూనియర్ ఇంటర్లో షిరీన్ సుల్తానా ఎంపీసీలో 465, సంజన బైపీసీలో 435, హారిక సీఈసీలో 483 మార్కులతో టాపర్స్ గా నిలిచారాని ఇంచార్జ్ ప్రిన్సిపల్ వినోద్ కుమార్ తెలిపారు. ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.