13 August, 2026 | 1:28 AM

స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వార్షికోత్సవం

13-08-2026 12:02 AM

జూబ్లీహిల్స్‌లో వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రత్యేక అ తిథిగా హాజరయ్యారు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డును ప్రారంభిం చారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడు తూ.. ఆరోగ్య సంరక్షణలో నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ నాలుగేళ్లలో ప్రజల విశ్వాసాన్ని పొందుతూ ముందుకు సాగడం అభినందనీయం అన్నారు.

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ‘ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం’ అన్నారు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ ఇం టర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. భరత్ రెడ్డి డి. మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక, విశ్వసనీయమై న డయాగ్నస్టిక్ సేవలను అందించడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు.