13 August, 2026 | 2:29 AM

రైతులకు ఉచిత వైద్య సేవలు

13-08-2026 01:27 AM

ప్యాక్స్ ఛైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి

వేములవాడ, ఆగస్ట్ 12, (విజయ క్రాంతి): రైతుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రైతులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలతో పాటు ఆరోగ్యంపై పలు సూచనలు అందించారు.ఈ సందర్భంగా ప్యాక్స్ ఛైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచిత వైద్య సేవలు అందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందిని అభినందించారు.

రైతుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్లోనూ రైతుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ పవన్కుమార్, ఉపాధ్యక్షుడు కాంతారావు, డైరెక్టర్లు దొంతగోని రాజయ్య, అమృత, మాజీ డైరెక్టర్ గుడిసె సదానందం, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.