13 August, 2026 | 1:29 AM

357 మందికి ఆర్కిటెక్చర్ సీట్లు కేటాయింపు

13-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తొలివిడత బ్యాచిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటనను కన్వీనర్ ప్రొఫెసర్ డి.షర్మిల విడుదల చేశారు. మొత్తం 465 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా, వాటికి 433 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్ నమోదు చేసుకోగా అందులో 357 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఫీజు చెల్లించి 13, 14 తేదీల్లో ఆయా కాలేజీల్లో జాయిన్ కావాలని ఆమె సూచించారు.