13 August, 2026 | 2:35 AM

200 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో తిరంగా ర్యాలీ

13-08-2026 01:28 AM

గన్నేరువరం, ఆగస్టు12(విజయక్రాంతి):స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 200 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి రాజీవ్ రహదారి పై నుండి గుండ్లపల్లి వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది.