13 August, 2026 | 2:32 AM

సిద్ధార్థ పాఠశాలలో నాయకుల ఎంపిక

13-08-2026 01:26 AM

సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి 

చొప్పదండి 12 ఆగస్టు (విజయ క్రాంతి).చొప్పదండి మండలంలోని ఇంగ్లీష్ మీడియం సిద్ధార్థ హై స్కూల్లో బుధవారం రోజున వివిధ హౌస్ విభాగాలకు చెందిన విద్యార్థి నాయకులను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి కి వివిధ హౌస్ విభాగాలకు చెందిన విద్యార్థులు సాదర స్వాగతాన్ని పలికారు. అనంతరం చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందజేసి, వారిని అభినందించారు. గత విద్యా సంవత్సరం అన్ని రకాల పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కును అందజేశారు. దీనితోపాటు మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు.