క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
21-05-2026 01:56 AM
చండూరు, మే 20 : క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయని చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. బుధవారం చండూరు మండల కేంద్రంలోని హైస్కూల్లో కింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో తోకల వెంకన్న తండ్రి తోకల లక్ష్మయ్య జ్ఞాపకార్థంతో క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు శారీరక దారుఢ్యానికి ఎంతో గాను ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గండూరి వెంకన్న, కారింగు యాదయ్య, మాదగొని ఆంజనేయులు, నక్కపోతు సురేష్, కారింగుల రవీందర్ ( కరాటే మాస్టర్), నల్లగంటి రమేష్, రామగిరి మోహన్, సుంకోజు శ్రీను, సోమ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.






