జిమ్ పరిసరాలు శుభ్రం
31-07-2026 12:50 AM
గంభీరావుపేట, జులై 30 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జి ల్లా గంభీరావుపేట మం డల కేంద్రంలో ప్ర జల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిర్వహణ లోపంతో అధ్వాన స్థితికి చేరిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 27న ‘జిమ్ నిర్వహణపై పట్టింపేది‘ అనే శీర్షికతో చెత్త పేరుకుపోవడం, పిచ్చి మొక్కలు పెరగడం, పరికరాలు తుప్పు పట్ట డం వంటి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన కథనాన్ని విజయ క్రాంతి ప్రచు రించింది.
ఈ కథనానికి స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, జిమ్ పరిసరాలను శుభ్రపరిచి చెత్తాచెదారం తొలగించారు. అలాగే పిచ్చి మొక్కలను తొల గించి జిమ్ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు.సమస్య పరిష్కారా నికి కృషి చేసిన విజయ క్రాంతికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.






