10 June, 2026 | 3:19 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

యువతకు క్రీడా పోటీలు ఆదర్శనీయం

09-01-2026 12:00 AM
  1. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు  
  2. క్రీడా పోటీలకు ఆహ్వానం 
  3. సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి

గుమ్మడిదల, జనవరి 8: యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం ఆదర్శనీయమని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలకు ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావును గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం,జట్టు భావన, ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడలకు ప్రాధాన్యం ఎంతో ముఖ్యమని  పేర్కొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిగా సిజిఆర్ ట్రస్ట్ యువత కోసం క్రీడా పోటీలను నిర్వహించడం ఆదర్శనీయమని అభినందించారు.

యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. 12వ తేదీ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.కార్యక్రమంలో జిన్నారం వెంకటేష్ గౌడ్, కుమార్ గౌడ్, సంతోష్ రెడ్డి, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.