10 June, 2026 | 2:59 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి

10-06-2026 02:19 PM

గీత కార్మిక జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల జనార్ధన్

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు చీకటి శ్రీనివాస్ తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి మూడు ఎముకలు విరగడంతో పాటు తలకు గాయమై పది కుట్లు పడ్డాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న శ్రీనివాస్‌ను కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల జనార్ధన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న ఈ పేద కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌కు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసి కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షుడు మద్దెల నరసయ్య, కార్యదర్శి చిర్ర నరేష్, గొట్టిపర్తి సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని వెంకన్న, చీకటి మల్లయ్య, చామకూరి శ్రీను, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.