calender_icon.png 7 February, 2026 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు విద్యార్థుల మనోవికాసానికి హేతువులు

06-02-2026 12:10:23 AM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ అజముద్దీన్

జవహర్‌నగర్ ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మానసిక క్రీడలు విద్యార్థుల మనోవికాసానికి హేతువులని మనోవిజ్ఞానమే విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందిస్తుం దని జవహర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హజముద్దీన్ తెలిపారు. స్పెల్‌_ బి జిల్లా స్థాయి పోటీలను మల్కాజిగిరిలోని రిసోర్స్ సెంటర్లో గురువారం మండల విద్యాధికారి మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించగా జవహర్ నగర్ విద్యార్థి త్రిశాంక్ స్పెల్ బి డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్లో మొదటి బహుమతి సాధించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ఎంఈఓ మురళీకృష్ణ, మల్కాజ్గిరి ఎంఈఓ మనోహర్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.