20 June, 2026 | 1:24 PM

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

18-06-2026 12:59 PM

- సీపీ రష్మీ పెరుమాళ్ 

సిద్దిపేట క్రైం, జూన్ 18 : ఈ నెల 20న జరిగే లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీపడదగిన చిన్న చిన్న కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులు వృథా చేసుకోకుండా కక్షిదారులకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. కంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వాహణ, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్, చెక్ బౌన్స్, ఇతర రాజీ పడదగిన కేసులలో నిందితులు, ఫిర్యాదుదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.