క్రీడా గాయాలకు ప్రత్యేక కేంద్రం
అపోలో హాస్పిటల్స్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు
హైదరాబాద్, మే 8(విజయక్రాంతి): క్రీడా గాయాలు, ఆర్థోపెడిక్ సమస్యలకు అ త్యాధునిక వైద్యం అందించేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని అపోలో హాస్పిటల్లో అ పోలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆర్థోపెడిక్స్‌ను ప్రారంభించా రు. క్రీడాకారులు, ఫిట్‌నెస్ అభిరుచి కలిగిన వారికి ఒకేచోట నిర్ధారణ, శస్త్రచికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ కామినేని, ప్ర భుత్వ క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రన్‌జన్ పాల్గొన్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు ప్రఫుల్ హింగే, సాకి బ్ హుస్సేన్‌కు వివరించారు.
ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ దీప్తి మాట్లాడుతూ సమయానికి ఖచ్చితమైన నిర్ధారణ, చికిత్స అవసరమ ని తెలిపారు. లిగమెంట్ గాయాల నుంచి క్లిష్టమైన కీళ్ల సమస్యల వరకు ఆధునిక శస్త్రచికిత్సలు, శాస్త్రీయ పునరావాస విధానాల తో చికిత్స అందిస్తామని చెప్పారు. అపోలో ఆస్పత్రుల తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్విరావు వీరేపల్లి మాట్లాడుతూ క్రీడలు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతు న్న నేపథ్యంలో ప్రత్యేక వైద్యసేవల అవసరం కూడా పెరుగుతోందన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో ఆస్పత్రుల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్కరణ్ సింగ్ మాట్లాడుతూ కేంద్రంలో డాక్టర్ రవితేజ రుద్రరాజు, డాక్టర్ రమిందర్ కౌర్ తదితర నిపుణులు సేవలందించనున్నారని తెలిపారు.






