9 May, 2026 | 2:18 AM

మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం

09-05-2026 12:00 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా

ప్రజాభవన్‌లో మధుపార్క్ రిడ్జ్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రుల భేటీ

మూసీ నది పునర్జీవనానికి సహకరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. శుక్రవారం ప్రజా భవన్‌లో మూసీ పునర్జీవన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను మధుపార్క్ రిడ్జ్ (బీ రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ వినతులను మంత్రులకు సమర్పించారు. నివాసితులు వ్యక్తం చేసిన సందేహాలు, అపోహలను మంత్రులు ని వృ త్తి చేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మధుపార్క్ రిడ్జ్ బీ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం  సానుకూల దృక్పథంతో ఉన్నదన్నారు.

ప్రజలందరూ సంతో షంగా ఉండాలని, వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగ స్వాములు కావాలని  కోరారు. ప్రభుత్వ హా మీ పట్ల అసోసియేషన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.  సమావేశంలో మధుపార్క్ రిడ్జ్ అసోసియేషన్ అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జీ.వీ.శేఖర్, స భ్యులు సత్యనారాయణ, గౌతమ్ రాయ్, రే ణుధల్, నబీ సాహేబ్, సాహిల్ ఖాన్ పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన మూసీ ప్రాజెక్ట్ ఎండీ  నర్సింహారెడ్డి, జాయింట్ ఎండీ గౌతమి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి  హాజరయ్యారు.