calender_icon.png 16 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు

15-02-2026 12:00:00 AM

  1. భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
  2. జంపన ప్రతాప్ 

సికింద్రాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : న్యూ బోయన్ పల్లి పోస్ట్ ఆఫీస్ వెనుక ఉన్న శివాలయం లో మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఆలయ కమిటీ సభ్యులను కోరారు. శనివారం జంపన ప్రతాప్ ఆలయాన్ని సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు చేసారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఆదివారం ఉదయం ఆరు గంటలకు నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షులు ఈ. శ్రీనివాస చారి తెలిపారు. ప్రత్యేక పూజలు అభిషేకలు. రాత్రి జాగరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో రాధాకృష్ణ ముదిరాజు. రాజు ముదిరాజు పాల్గొన్నారు.