4 July, 2026 | 10:31 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

చేసే పనులతోనే ప్రత్యేక గుర్తింపు

19-12-2025 12:38 AM

మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి 

జడ్చర్ల, డిసెంబర్ 18: సర్పంచులుగా గెలవడంతోపాటు గ్రామంలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేందుకు సహాయ శక్తులుగా పనిచేయాలని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్,వార్డు మెంబెర్స్ ను మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి  సన్మానించారు.

అధికార పార్టీని ఎదిరించి పోరాడి విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబెర్స్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందేందుకు కృషి చేసిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించిన ప్రజలకు మాజీ మంత్రి  డా.సి.లక్ష్మారెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.