30 August, 2026 | 1:20 AM

బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ

30-08-2026 12:33 AM

అల్వాల్,(విజయక్రాంతి): దేవుని అల్వాల్ లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నేతృత్వంలో స్వామి వారికి సువర్ణ పుష్పార్చన గావించారు. తదనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. సెప్టెంబర్ 7వ తేది  సోమవారం నుండి 9వ తేదీ వరకు శ్రీలక్ష్మీ సుదర్శన మహా యజ్ఞం నిర్వహించ సంకల్పించామని ఆలయ కమిటీ తెలిపింది.

ఈ క్రతువులో పాల్గొను భక్తులు ఒక రోజుకు రూ 1,516, మూడు రోజులకు రూ 4,516 చెల్లించి యాగంలో పాల్గొన్న వచ్చన్నారు. ఈ యాగం భక్తుల అభీష్టం మేరకు నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఈ సదవకాశాన్ని సద్విని యోగం చేసుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనారు.