17 June, 2026 | 4:35 AM

మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు

17-06-2026 03:01 AM

బోధన్, జూన్16 (విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు ప్రగతి పథంలో నడిపిస్తున్న సందర్భంగా, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ విశేష పూజా కార్యక్రమాన్ని ప్రవీణ్ పండితులు తమ చేతుల మీదుగా అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ... దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో మోదీ అవినీతి రహిత సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలిపాక బాలరాజు, మాసిని వినోద్, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.