15 May, 2026 | 2:06 AM

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు

15-05-2026 12:05 AM

యాదగిరిగుట్ట, మే 14 (విజయ క్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో గురువారం నిత్య పూజలు వైభవంగా నిర్వ హించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవులను మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయం భులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యా ల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు.

ప్రాకారమం టపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మును చూచి భక్తులు భక్తి పారవశ్యంలో  తేలిపోయారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు వివిధ శాఖల నుంచి ఆదాయం రూ.29,97,382 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.