15 May, 2026 | 3:29 AM

ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకుల విద్యార్థికి నగదు పురస్కారం

15-05-2026 02:06 AM

ఊరుకొండ మే 14 : నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్లో విద్యనభ్యసించిన మారోజు రిషిత పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి ప్రతిభ సాధించడంతో గురువారం. హైదరాబాద్లోని కొమరం భీమ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అండుకుంది.

నాగర్కర్నూల్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మారోజు రిషిత తండ్రి: మారోజు రమేష్ సాధించిన ఈ విజయాన్ని గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల నగదు బహుమతితో సత్కరించింది.రిషిత విజయంపై గ్రామస్తులు, గురుకుల ఉపాధ్యా యులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.