27 July, 2026 | 3:22 PM

శివనామస్మరణతో మారుమోగిన కంఠమహేశ్వరుని ఆలయం

27-07-2026 02:08 PM

కీతవారిగూడెంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు...

​గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ సూరమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో(Sri Kanthamaheswara Swamy Temple) దశమ వార్షికోత్సవములో భాగంగా 16 రోజుల పండుగను గౌడ కులస్తులు, గ్రామస్తులు పురస్కరించుకుని భక్తులు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు శోభాయమానంగా పూజలు జరిపారు.

​అనంతరం స్వామివార్లకు సాంప్రదాయబద్ధంగా పాల పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గూడెపూరి గోపయ్య, వైస్ చైర్మన్ గుండు రాంబాబు, పెద్దగౌడ్ గుండు వెంకన్న, సారేగౌడ్ తుమ్మల గురవయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయం 'ఓం నమఃశివాయ' స్మరణలతో మారుమోగింది.