27 July, 2026 | 2:32 PM

చేగుంటలో విత్తన మేళా

27-07-2026 02:04 PM

చేగుంట జూలై 27,విజయక్రాంతి: చేగుంట రైతు వేదికలో వ్యవసాయ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో  సోమవారం విత్తన మేళా నిర్వహించారు. వరి పంటకు బదులుగా  కంది, మొక్కజొన్న, వివిధ కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు.అధికారులు ఈ సందర్బంగా తక్కువ నీటితో అధిక లాభాలు పొందే ప్రత్యామ్నాయ పంటల సాగు, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై  రైతులకు అవగాహన కల్పించారు.