27 July, 2026 | 3:21 PM

ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఐటీడీఏ పీఓ

27-07-2026 02:16 PM

గిరిజన విద్యార్థుల విద్య, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి... 

ఉట్నూరు, జూలై 27 (విజయక్రాంతి): గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందేలా ప్రతి ఉపాధ్యాయుడు, అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూరు ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. సోమవారం ఉదయం ఉట్నూరు మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల(ఏందా ), అనంతర ఏందా గ్రామంలోని   అంగన్వాడి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ముందుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి మరియు పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని తెలుసుకునేందుకు ఆలోచనాత్మక ప్రశ్నలు అడిగి, వారి మేధో సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా చిన్నచిన్న పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, లక్ష్యసాధన అలవర్చుకోవాలని సూచించారు.