16 May, 2026 | 11:03 PM

మేస్త్రీలతో ప్రత్యేక సమావేశం

16-05-2026 10:00 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గ్రామ రహదారులను పరిరక్షించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడం లక్ష్యంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం మేస్త్రీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో కొత్తగా నిర్మించుకునే ఇళ్ల వద్ద రహదారిలోకి వచ్చే విధంగా రాంపులు, మెట్లు నిర్మించవద్దని గ్రామపంచాయతీ పాలకవర్గం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే నిర్మాణాలు చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఎలాంటి కొత్త గృహ నిర్మాణాలు ప్రారంభించవద్దని, నిర్మాణ పనులకు వచ్చే కూలీల వివరాలను తప్పనిసరిగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని మేస్త్రీలకు తెలియజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గోల్కొండ కళ రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు రహదారుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, ఉపసర్పంచ్ దండవేణి రాజేందర్, గ్రామ కార్యదర్శి సౌజన్య, వార్డ్ సభ్యులు, మేస్త్రీలు పాల్గొన్నారు.