అంబేద్కర్ నగర్‌లో ప్రత్యేక వైద్యశిబిరం
సత్తుపల్లి జులై17( విజయ క్రాంతి): మండల పరిధిలోని కిష్టారం గ్రామం లో గల అంబేద్కర్ నగర్ కాలనీలో వాతావరణ మార్పుల కారణంగా సంక్రమించే వ్యాధుల దృష్ట్యా గ్రామ ఎం.ఎల్.హెచ్.పి నర్సింగ్ వైద్యురాలు ప్రసన్న ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో జ్వరాలు, రక్తహీనత, షుగర్ వ్యాధులు ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించి తగిన మందులను అందించారు. వృద్ధులకు బిపి పరీక్షలు నిర్వహించి,నెలవారి మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తుండడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని,దోమల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, రెండు రోజులకు మించి జ్వరం వస్తే వెంటనే వైద్యశాలను సంప్రదించి,రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం లు బేగం, సుమతి, ఆశా కార్యకర్తలు సుజా త, చిలకమ్మా తదితరులు పాల్గొన్నారు.






