29 May, 2026 | 11:06 PM

ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

29-05-2026 04:13 PM

రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 

సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచన

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా చూడాలని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని సూచించారు.జిల్లా అభివృద్ధి కోసం అన్ని శాఖలు సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని గవర్నర్ పేర్కొన్నారు.