పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి
- మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాష్
- కొనసాగుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. శనివారం దస్నాపూర్ ప్రాంతంలోని 2, 3 వార్డుల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలిసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ సందర్భంగా దోమల నివారణ కోసం ఫాగింగ్ స్ప్రే చేయడంతో పాటు వీధుల్లో బ్లీచింగ్ పొడి చల్లించారు.
కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం ఎంతో అవసరమని చెప్పారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచి మున్సిపాలిటీకి సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్ గోవింద్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




