7 March, 2026 | 4:20 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •  

​శంకర్‌పల్లి అభివృద్ధికి 99 రోజుల ప్రణాళిక

07-03-2026 12:49 PM
  1. సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి
  2. ​మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్‌తో కలిసి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం
  3. పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయి అవార్డే లక్ష్యం కావాలి
  4. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రత్యేక డ్రైవ్

​శంకర్‌పల్లి,(విజయక్రాంతి): శంకర్‌పల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ (CDMA) డాక్టర్ టి.కె. శ్రీదేవి గారు కీలక కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

​99 రోజుల సమగ్ర కార్యాచరణ

​ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, మార్చి 6 నుండి జూన్ 12 వరకు సుమారు 99 రోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని వివరించారు. ఈ కాలంలో కేవలం పారిశుద్ధ్యం మాత్రమే కాకుండా విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత మరియు నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపై విడతల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.

​తొలి పది రోజులు అత్యంత కీలకం

​మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు చేపట్టే మొదటి విడత డ్రైవ్‌లో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించనున్నట్లు సీడీఎంఏ తెలిపారు.పట్టణంలోని ప్రతి గల్లీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయడం పై దృష్టి సారించాలని చెప్పారు.మున్సిపల్ కార్యాలయంలో పేరుకుపోయిన ఫైళ్లను వెనువెంటనే క్లియర్ చేసి ప్రజలకు పాలనను చేరువ చేయలన్నారు.

జాతీయ అవార్డు లక్ష్యంగా అడుగులు

​పారిశుద్ధ్యం విషయంలో శంకర్‌పల్లి పట్టణం జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, అవార్డు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రజలు రోడ్లపై చెత్త వేయరాదని, తడి-పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకే అందించాలని, అలాగే ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలని ఆమె పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ కే. ఫల్గుణ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ జూలకంటి శ్వేత పాండురంగ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు దండు రాజేశ్వర్, అశోక్, ఉషాకిరణ్ విజయ్ కుమార్, ఆనంద్ రావు, గణేష్, గిరిజ చంద్రశేఖర్ పాల్గొన్నారు. వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ యోగేష్, మేనేజర్ అంజన్ కుమార్, డిఈ యాదయ్య, ఏఈ నరేష్, మెప్మా ఆర్పీలు మరియు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.