2 July, 2026 | 12:02 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

ఘట్ కేసర్ సర్కిల్‌లో ప్రత్యేక డ్రైవ్

24-02-2026 12:48 AM

పనికిరాని వాహనాల తొలగింపు

ఘట్ కేసర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్ కేసర్ సర్కిల్లో రహదారులపై నిర్లక్ష్యంగా విడిచిపెట్టబడిన, పనికిరాని, వినియోగంలో లేని వాహనాల వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగడం, పారిశుధ్య సమస్యలు ఏర్పడటం, ప్రజలకు అసౌకర్యం కలగడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి ఆదేశాల మేరకు సోమవారం పోచారం డివిజన్ 8 లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది.

ఈ డ్రైవ్లో భాగంగా వివిధ కాలనీలు, ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో దీర్ఘకాలంగా నిల్వ ఉన్న అబాండన్డ్ వాహనాలను గుర్తించి వాటిని లిఫ్టింగ్ చేసి సంబంధిత యార్డుకు తరలించడం జరిగింది. రహదారులపై పనికిరాని వాహనాలను విడిచి పెట్టవద్దని, ఇటువంటి వాహనాలను స్వయంగా తొలగించని యజమానులపై జరిమానాలు విధించబడతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు తమ వాహనాలను రహదారులపై నిర్లక్ష్యంగా వదిలివేసిన, వినియోగంలో లేని వాహనాలను తొలగించి పట్టణ శుభ్రత, ట్రాఫిక్ సౌకర్యానికి సహకరించాలని డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి విజ్ఞప్తి చేశారు.