2 July, 2026 | 10:49 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటాం

24-02-2026 12:49 AM

ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండె శివకుమార్ 

అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 23: విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండె శివకుమార్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో అనాజ్ పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సోమవారం సందర్శించారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా గుండె శివకుమార్ మాట్లాడుతూ... విద్యార్థులకు ఎల్లప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు సమాచార ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.