రైతు వేదికలో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌పై రైతులకు అవగాహన సదస్సు
27-08-2026 05:42 PM
చేగుంట, ఆగస్టు 27, విజయక్రాంతి: చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి ఎం. హరిప్రసాద్ ఆధ్వర్యంలో రైతులకు ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల కొనుగోలు, బుకింగ్ ప్రక్రియలో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో ఎదురవుతున్న వివిధ సాంకేతిక సమస్యలు, సందేహాలను రైతులకు క్షుణ్ణంగా వివరించి నివృత్తి చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ సులభతరంగా ఎరువులు పొందే విధానాన్ని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు మాధవి, కళ్యాణి, రమణ, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.






