26 April, 2026 | 1:26 AM

అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

26-04-2026 12:00 AM
  1. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి
  2. ఐదుగురు నిందితుల అరెస్ట్

సికింద్రాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మహంకాళి పోలీసులు వెండి వ్యాపారులను నకిలీ వెండితో మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిపి రక్షిత కృష్ణమూర్తి పత్రిక విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సికింద్రాబాద్లోని అవులమందకు చెందిన హీరాలాల్ వర్మ గత 10 ఏళ్లుగా మహంకాళి స్ట్రీట్లో శ్రీ జగదాంబ ఇండస్ట్రీస్ పేరుతో సిల్వర్ రిఫైనరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

25.03.26న సాయంత్రం 4:30 గంటలకు, ఆయన రెగ్యులర్ కస్టమర్ అయిన రాజేష్ మరో వ్యక్తితో కలిసి షాపుకు వచ్చారు. వారు సుమారు 10 కిలోల బరువున్న మూడు వెం డి కడ్డీలను (సుమారు 60% పైగా స్వచ్ఛత కలిగినవిగా) తెచ్చారు. దానికి సంబంధించి ‘దుర్గా బులియన్ రిఫైనరీ‘ ఇచ్చిన ప్యూరిటీ సర్టిఫికేట్ను కూడా చూపారు.

గతంలో రాజేష్ పలుమార్లు లావాదేవీలు జరిపి ఉండటంతో, ఫిర్యాదుదారుడు వారిని నమ్మి, ఆ మెటీరియల్ను పరీక్షించకుండానే దానికి బదులుగా రూ. 15,00,000/- విలువైన 6,350 గ్రాము ల స్వచ్ఛమైన వెండి కడ్డీలను  వారికి అప్పగించారు. వారు వెళ్ళిన తర్వాత ఆ మెటీరియల్ను పరీక్షించగా, అందులో ఏమాత్రం వెండి (0% వెండి) లేదని తేలింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మహంకాళి పో లీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే ముఠా మహంకాళి మరియు మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇదే తరహాలో మో సాలకు పాల్పడి, సుమారు 12.5 కిలోల వెం డిని కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ ప్యూరిటీ సర్టిఫికేట్లు సృష్టించి, వ్యాపారుల నుండి అసలైన వెండిని తీసుకుని పరారవుతారు. ఈ ముఠా మహంకాళి పోలీస్ స్టేషన్   (Cr.No 80/2026) మరియు మా ర్కెట్ పోలీస్ స్టేషన్ (Cr.No 80/2026) లలో జరిగిన వెండి చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

ఇందులో మహంకాళి కేసులో 6.2 కిలోలు, మార్కెట్ కేసులో 6 కిలోల వెండిని వీరుకాజేశారు.ఇదే విధంగా గతం లో వీరు మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడ్డా రు. ఇందులో మహంకాళి కేసులో 6.2 కిలోలు, మార్కెట్ కేసులో 6 కిలోల వెండిని వీరు కాజేశారు.నిందితుల నుండి మొత్తం 8.4 కిలోల వెండి, రూ. 1.5 లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను రెడ్మీ, నోకియా, ఇన్ఫినిక్స్, శామ్సంగ్  స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదిం చిన సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జె. నరసయ్య, మహంకాళి ఏసీపీ సిహెచ్. శ్రీధర్, మహంకాళి ఇన్స్పెక్టర్ ఎస్. రవికుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె. రంగారెడ్డి, డీఎస్‌ఐ ప్రసాద్ రెడ్డి, క్రైమ్ టీమ్ సిబ్బంది పిసిలు సంతోష్, రమేష్, శ్రీకాంత్, మహేష్, సాయి కుమార్, శ్రీనివాస్లను ఉన్నతాధికారులు అభినందించారు.