10 March, 2026 | 10:32 AM

రానున్నది బీసీల రాజ్యామే

10-03-2026 02:55 AM

రాజ్యాధికారానికి పోరాడే సమయం అసన్నమైంది

బీసీల బడ్జెట్ కేటాయింపు అన్యాయంపై జరిగిన సమావేశంలో వక్తలు

బీసీలందరూ ఏకం కావాలని పిలుపు

ముషీరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): రానున్నది బీసీల రాజ్యామేనని, బీసీలందరూ రాజ్యాధికారం కోసం పోరాడవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. బీసీ డెమోక్రెటిక్స్ జేఏసీ చైర్మన్ కోలా జనార్ధన్ అధ్యక్షతన, బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మన్ గుజ్జ కృష్ణ నేతృత్వంలో సోమవారం కాచిగూడలోని ఓ హోటల్లో రాష్ట్ర, కేం ద్ర ప్రభుత్వాలు బీసీల బడ్జెట్ కేటాయింపు అన్యాయంపై కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిధులుగా శాసనమండలి ఎల్పీ నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ లు బండ ప్రకాశ్, ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, చెరుకు సుధాకర్ హాజరైనారు.

అనంతరం శాసనమండలి ఎల్‌పి నేత మధుసూదనాచారి, మాజీ మం త్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఆహింసా మార్గంలో తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్రం మాదిరిగా బీసీల రాజ్యాధికారం కోసం బీసీలందరు ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. బీసీలు నడి రోడ్డుపై ఉద్యామాలు చేస్తేనే ప్రభుతాలు దిగివచ్చి, సమస్యలు పరిష్కారిస్తాయని వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీలో బీసీల నివాదం తగ్గిపోయిందని, అగ్రవర్ణల ఆధిపత్యం పెరిందని, బీసీ నివాదం భవితరాలకు చెందాలని, ప్రజలను చైతన్య పరిచేం దుకు బీసీ ఉద్యమాన్ని మరింతగా జిల్లా, మం డల, గ్రామ స్థాయిలో ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాలు బీసీలను పల్లకి మోసే కూలీలుగా చూస్తున్నాయని, అందుకు బీసీల ఐకమత్యాన్ని చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీసీ వాదం బలంగా ఉందని, నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించారు. బీసీ ఉద్యమం ప్రజల గుండెల్లో ఉందని, రానున్నది బీసీల రాజ్యామేనని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అగ్రవర్ణ చేతుల్లో పెట్టొద్దని  పిలుపునిచ్చారు.

బీసీలకు రాజ్యాధికారం రాకుండా దేశంలో భారీ కుట్ర జరుగుతుందని,10 శాతం వ్యక్తుల వద్ద 90 శాతం సంపద కేంద్రీకృతమైందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని, ఇది బీసీ సమాజానికి జరుగుతున్న ఘోరమైన ఆవమానం, క్రూరమైన పరిహాసమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకై గ్రామగ్రామాన ఉద్యమాన్ని ఉదృతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నందగోపాల్, ఉదయ్ నేత, దిడ్డి రాంబాబు, శివమ్మ, వివిధ సంఘాల బీసీ నాయకులు పాల్గొన్నారు.