రాజేంద్రనగర్ డీసీ కార్యాలయమే.. ఏసీబీ నెక్ట్స్ టార్గెట్..?
టౌన్ ప్లానింగ్ అధికారుల మామూళ్ల దందాపై ఫోకస్..
స్నేహిత హిల్స్‌లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు...!
జీ ప్లస్ 7 భారీ భవన నిర్మాణాలు
బండ్లగూడ జాగీరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్‌లో పాపాలను కడిగేందుకు సిద్ధమౌతున్న ఏసీబీ అధికారులు..!
మొక్కు బడిగా బిల్డర్లకు నోటీసులిచ్చి సెటిల్‌మెంట్లు చేసిన అధికారులు ?
రాజేంద్రనగర్, మార్చి 9 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీలలో గతంలో నిర్మించిన అక్రమ నిర్మాణా లపై ప్రస్తుతం కొనసాగుతున్న వాటిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు అధికారుల ప్రమేయంపై గత నాలుగు రోజులుగా ఏసీబీ అధికారులు శేర్లింగంపల్లి డీసీ కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గతంలో మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతులు.. క్షేత్రస్థాయిలో అక్రమంగా నిర్మించిన భారీ భవనాల తీరు తదితర సమాచారం ఆధారంగా అధికారుల టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రమేయంపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అక్రమ భవన నిర్మాణాలపై శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కొనసాగినట్లుగానే గతం లో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా భారీ మొత్తంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. 300ల నుంచి ౬౦౦ గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 7 అంతస్తుల భారీ భవనాలను నిర్మించడంపై గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందు కు చర్యలు తీసుకోలేదు..? అనే కోణంలో ఇప్పటికే ఏసిబి దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది. గత మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసిన అధికారులు ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కూడా వారే టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. గతంలో బిల్డర్ల దగ్గర అక్రమాల దందా నడపడంతోనే బిల్డర్లు
యేథేచ్ఛగా అనుమతులు తీసుకున్న దానికంటే పెద్ద మొత్తంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలుస్తుంది. స్నేహిత హిల్స్ లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు నేటికీ కొనసాగుతున్నప్పటికీ అధికారులు అడ్డు చెప్పిన పాపాన పోలేదు ఈ అక్రమ నిర్మాణాల వెనుక గత మున్సిపల్ కమిషనర్ తో పాటు ప్రస్తుత టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు పెద్ద ఎత్తున మామూలు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఇటీ వల ఆరంగర్ దగ్గర నిర్మిస్తున్న ఓ భారీ భవనంపై నుండి కార్మికులు కిందపడి ప్రాణా లు కోల్పోయిన సంఘటనతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఎలాంటి సెట్ బ్యాక్ లు ఫైర్ సెఫ్ట్ తో పాటు ఎలాంటి మినిమం రూల్స్ ను కూడా బిల్డర్లు పాటించలేదు..బిల్డర్ల ను పాటించమని అడిగిన.. ఆదేశించిన పాపాన టౌన్ ప్లానింగ్ అధికారులు పోలేదు..
అక్రమ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం: ఏసీపీ
రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో గతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్న వాటిపై ఏసీపీ సుధాకర్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో అక్ర మ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని నిబంధనలు పాటించక పోతే ఉన్నత అధికారుల ఆదేశాలతో భవనాలను నిర్మించినా సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.




