21-02-2026 02:11:21 PM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర...
బాన్సువాడ,(విజయక్రాంతి): అసాంఘిక శక్తులు సృష్టిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ(Banswada bandh) పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఓ మాల్లో సేల్స్గల్స్తో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడన్నారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందడంతో అతడిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం రాత్రి బాన్సువాడ పోలీస్స్టేషన్ ఎదుట రాళ్లు రువ్వుతూ హంగామా చేశారన్నారు.
ఈ ఘటనలో తమ కానిస్టేబుల్కు గాయాలయ్యాయని తెలిపారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 42 మందిపై కేసులు నమోదు చేయబోతున్నామని తెలిపారు. అలాగే బాన్సువాడ బంద్ అంటూ కొందరు పిలుపునిచ్చారని.. సోషల్ మీడియాలో(Social media) సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. వారిని సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే ఒకరిపై కేసు నమోదైందని.. మరికొందరిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు విట్టల్ రెడ్డి శ్రీనివాసరావు పట్టణ సీఐ తుల శ్రీధర్ రూరల్ సిఐ తిరుపతయ్య పోలీస్ సిబ్బంది ఉన్నారు.