పస్ర పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
ములుగు (మహబూబాబాద్) జూన్ 16 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ జిల్లాలోని పస్ర పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కలియ తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో 5 ఎస్ విధానాన్ని అవలంబించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ కి వచ్చే పిర్యాదు దారులతో మర్యాదగా నడుచుకోవాలని రిసెప్షన్ సి బ్బందిని ఆదేశించారు. రానున్న వర్షాకాలం లో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి వి పత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు తో డుగా ఉండాలని, అందుకు ముందస్తు ప్ర ణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్, పసర సీఐ దయాకర్ పాల్గొన్నారు.
జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలన
ములుగు జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా బుధవారం ఇంచర్ల ఎం ఆర్ గార్డెన్ లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. వేలాది మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గట్టుగా తాగునీటి వసతి ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
గుత్తి కోయ విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
గోవిందరావుపేట మండలం గుత్తి కోయ గుంపు విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. గుత్తి కోయ గుంపు కు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని, సోలార్ లైట్లు ఏర్పాటు చేయిస్తామని , ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని పిల్లలను చక్కగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీ ఐ ద యాకర్, పసర ఎస్ ఐ తాజుద్దీన్, తాడ్వాయి ఎస్ ఐ జగదీష్, నార్లాపూర్ ఎస్‌ఐ కమలాకర్ పాల్గొన్నారు.






