13 May, 2026 | 7:10 PM

జొన్న పంట సాగుచేసిన రైతాంగానికి సత్వరమే గన్ని బ్యాగులు ఇవ్వండి: ఎమ్మెల్యే

13-05-2026 06:21 PM

బోథ్,(విజయక్రాంతి): రైతుల పండించిన పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉందని స్థానిక శాసనసభ్యులు అనిల్ పేర్కొన్నారు బుధవారం సోనాల మండల కేంద్రంలో జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని నిబంధనలతో ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. జొన్న పంట ఎకరానికి 25 నుండి 30 వరకు దిగుబడి వస్తుందని అయితే ప్రభుత్వం మాత్రం 10: క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని పేర్కొనడం సరైంది కాదన్నారు. మరోవైపు గత 20 రోజులుగా బోత్ మార్కెట్లో గన్నివేవుల కొరత ఉందని ప్రభుత్వంఇక అన్ని భవనం వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.